మరుగుదొడ్డి ఉంటేనే పెళ్లి...

SMTV Desk 2017-10-22 18:59:58  BAGPATH, TOILET, MARRIAGE

బాగ్ పత్, అక్టోబర్ 22: పెళ్లి చేసుకోబోయే అత్తవారింట్లో మరుగుదొడ్డి లేకపోతే పెళ్లి చేయమంటూ ఊరు పెద్దలు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ లోని గ్రామస్థులు మహిళల గౌరవాన్ని కాపాడేందుకు, ఓపెన్ డిఫకేషన్ ను నిర్మూలించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు గ్రామ పెద్ద అరవింద్‌ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని ఎవరైనా అతిక్రమిస్తే వాళ్ళకి సామాజిక బహిష్కరణ విధిస్తామని పేర్కొన్నారు. ఈ వినూత్న నిర్ణయం అన్ని గ్రామాలలో అవలంబిస్తే మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండదంటూ గ్రామ పెద్దలు చెప్పుకొచ్చారు.