కొలిక్కి వచ్చిన గేదెల రాజు హత్య కేసు

SMTV Desk 2017-10-21 18:54:49  gedela raju murder mistry, DSP Ravi Babu surrender

విశాఖ, అక్టోబర్ 21 : విశాఖలో సంచలనం సృష్టించిన గేదెల రాజు, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కుమార్తె పద్మలత హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న డీఎస్పీ రవిబాబు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గేదెల రాజు హత్య కేసులో మొత్తం 11మందిపై కేసులు పెట్టిన పోలీసులు డీఎస్పీ రవిబాబు, శ్రీనివాసరాజు మినహా మిగతా వారిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాగా రాజు హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిన డీఎస్పీ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇంకా ఈ కేసులో మిగిలి ఉన్న ఏ2 ప్రధాన నిందితుడు శ్రీనివాసరాజు ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.