ఎస్ ఎల్ ఆర్ తప్ప పాలసీ రేట్లు యథాతథం

SMTV Desk 2017-06-08 18:01:36  rbi,urgithpatel, Bi-monthly Monetary Policy

ముంబై, జూన్ 08 ‌: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జీత్ పటేల్ నేతృత్వంలో ప్రస్తుత సంవత్సరం రెండో ద్వైమాసిక పరపతి సమీక్ష సమావేశం ఎస్ ఎల్ ఆర్ తప్ప పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. స్టాట్యూటరీ లిక్విడ్ రేషియోను మాత్రం 0.5 శాతం తగ్గించాలని, తద్వారా బ్యాంకులు రుణాలు ఇవ్వడం పెరుగుతుందని ఆర్ బి ఐ సంకల్పించింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణ భయాలను చూపుతూ రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఇందుకు సంబంధించిన పరపతి సమీక్ష నిర్ణయాలను ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటి ప్రకటించింది. బ్యాంకులకు ఆర్ బి ఐ ఇచ్చే రుణాలపై ఆర్ బీ ఐ వసూలు చేసే వడ్డీ రేటును రేపో రేటు అంటారు. రేపో రేటును యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం రేపో రేటు 6.5 శాతంగా ఉంది. అదే విధంగా బ్యాంకుల వద్ద ఉన్న అదనపు నిధుల నిల్వలను ఆర్ బి ఐ తన వద్ద ఉంచుకొని ఇచ్చే వడ్డీ రేటు రివర్స్ రేపో ఆంటారు. ఆ ప్రకారం ఆరు శాతం రివర్స్ రేపోరేటు కొనసాగుతున్నది. అదే విధం గా డిపాజిట్లలలో బ్యాంకులు తప్పనిసరిగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఉంచాల్సిన మెుత్తానికి సంబంధించిన స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోను 0.5 శాతం తగ్గించింది. తగ్గింపుతో ఎస్ ఎల్ ఆర్ 20 శాతానికి తగ్గింది. తద్వారా బ్యాంకులకు మరిన్ని నగదు నిల్వలు అందుబాటులోకి వచ్చి రుణాలు ఇచ్చే సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడింది. దీర్ఘకాలంలో వృద్ధికి మద్దతు లభించేలా ద్రవ్యోల్బణం లక్ష్యాలకు అనుగుణంగా 2 శాతం 4 శాతం కొనసాగించడానికి తగిన పాలసీ రేటును యథాతథంగా కొనసాగించడానికి తగిన పాలసీని ప్రకటి స్తున్నట్లు ఆర్ బీ ఐ పేర్కొంది. పాలసీ రేటును యథాతథంగా కొనసాగించడానికి ఐదుగురు సభ్యులు సమ్మతించగా ఒకరు రవీంద్ర హెచ్ ధోలాకియా వ్యతిరేఖించారు.