విద్యుత్ ఘాతానికి బలైన ఎలక్ట్రీషియన్

SMTV Desk 2017-10-21 17:48:04  ELECTRICIAN DIED WITH CURRENT SHOCK, EAST GODAVARI, GANNAVARAM.

తూ.గో. అక్టోబర్ 21 : విద్యుత్ ఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా గన్నవరం మండలంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. గన్నవరానికి చెందిన కొంబత్తుల బాబూరావు(45) ఎలక్ట్రీషియన్ గా విధులు నిర్వహిస్తుండేవాడు. ఈ క్రమంలో చాకలి పాలెం వద్ద విధులు నిర్వర్తిస్తుండగా అకస్మాత్తుగా 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.