త్వరలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరిస్తా : తేజ

SMTV Desk 2017-10-20 20:07:09   DIRECTOR TEJA, NTR BIOPIC, RAM GOPAL VARMA, BALA KRISHNA,

హైదరాబాద్, అక్టోబర్ 20: ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను రామ్ గోపాల్ వర్మ చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బయోపిక్ మీద తాజాగా దర్శకుడు తేజ, తన సామాజిక మాధ్యమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఫేస్ బుక్ వేదికగా... ‘ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని త్వరలో తెరకెక్కిoచబోతున్నాను, ఈ చిత్రానికి ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనితో పాటు వెంకటేష్ తో ఓ సినిమా చేయబోతున్నాను. ఈ రెండు చిత్రాలు త్వరలోనే ప్రారంభమవుతాయి. కానీ నటీనటుల వివరాలు, తేదీ, వేదిక అన్నీ తానే స్వయంగా చెబుతానని అంతవరకు వేచి చూడాలని’ పోస్ట్ చేశారు. ఇంతకీ ఎన్టీఆర్ బయోపిక్ ను తేజ తెరపై చుయిస్తాడ.. లేదా రామ్ గోపాల్ వర్మ నా..? అనే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి.