బగ్ కు 1000 డాలర్ల బహుమతి..

SMTV Desk 2017-10-20 19:41:21   Bugs in apps, 1000 dollars reward, Hacker One company.

హైదరాబాద్, అక్టోబర్ 20 : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఒక కొత్త ప్రకటన చేసింది. గూగుల్‌ ప్లే స్టోర్‌లోని యాప్స్‌లో బగ్స్‌ను కనుక్కొని మెరుగైన సేవలు అందించే సెక్యూరిటీ పరిశోధకుల సమాచారం అందిస్తే వారికి 1000 డాలర్లు(దాదాపు రూ.65,000) రివార్డు ఇవ్వ‌నున్న‌ట్లు ప్రకటించింది. దీని కోసం గూగుల్ ‘హ్యాకర్‌ వన్‌’ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆండ్రాయిడ్‌ యాప్స్‌ తయారు చేసే ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. దీని వల్ల యాప్ ల సెక్యూరిటీ విషయంలో తగిన భద్రత ఉంటుందని సూచించింది. ఈ బగ్ ప్రోగ్రాంని గూగుల్ 2015 జూన్ నాడు ప్రారంభించింది.