పాక్ మాజీ ప్రధాని షరీఫ్ కు ఎదురుదెబ్బ

SMTV Desk 2017-10-20 19:31:20   Pakistani Former Prime Minister, Nawab Sharif, illegal issue.

ఇస్లామాబాద్‌,అక్టోబర్ 20 లండన్ లో అక్రమాస్తులు కూడబెట్టారని వస్తున్న ఆరోపణలలో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాబ్ షరీఫ్, ఆయన కుమార్తె, అల్లుడిపై జాతీయ జవాబు దారి సంస్థ ఎన్‌ఏబీ నమోదు చేసిన అవినీతి అభియోగాలను ఇస్లామాబాద్ లోని న్యాయస్థానం నిర్ధారించింది. ఈ కేసులో విచారణను వాయిదా వేయాలని షరీఫ్ అల్లుడు తరపున న్యాయవాది చేసిన అభ్యర్థనను అవినీతి నిరోధక న్యాయస్థానం తిరస్కరించి౦ది. తనపై, తన కుటుంబ సభ్యులపై ఎన్‌ఏబీ నమోదు చేసిన అభియోగాల విషయంలో నవాజ్ షరీఫ్ ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించగా తుది తీర్పు కొరకు అభియోగాలను నిర్దారించరాదని న్యాయస్థానాన్ని షరీఫ్ తరుపు న్యాయవాది కోరినా ఫలితం లేకుండా పోయింది. ఈ కేసులో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఎన్‌ఏబీ 3 కేసులను నమోదు చేసింది. పనామా పత్రాల కుంభకోణంలో పాక్ ప్రధాని షరీఫ్ అనర్హుడని సుప్రీ౦ కోర్టు తీర్పునిచ్చిన కొన్ని వారాల తర్వాత ఈ కేసులు నమోదయ్యాయి.