అమెరికా, రష్యాల తరువాత చైనా....

SMTV Desk 2017-10-20 19:03:32  chinaspace, station

బీజింగ్, అక్టోబర్ 20 : అమెరికా, రష్యాల తర్వాత సొంత స్పేస్‌ స్టేషన్‌ కలిగిన దేశంగా చైనా ఆవిర్భవించనుంది. మొట్టమొదటి కార్గో స్పేస్‌క్రాప్ట్‌ని అంతరిక్షంలోకి పంపేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. టీయాన్జు-1 అనే స్సేస్‌క్రాప్ట్‌ను ఏప్రిల్‌ 20 నుంచి 24 వాతావరణం అనుకూలంగా ఉన్న సమయంలో కక్ష్యలోకి పంపేందుకు సిద్ధమవుతోంది. వెన్‌చాంగ్‌ లాంచింగ్‌ సెంటర్‌ నుంచి లాంగ్‌మార్చ్‌–7 వై2 రాకెట్‌ ద్వారా ఈ కార్గో స్పేస్‌క్రాఫ్ట్‌ను నింగిలోకి పంపనున్నారు. 2022 నాటికి తమ స్పేస్‌ స్టేషన్‌ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని చైనా ఇప్పటికి ప్రకటించింది.