రానున్న రోజుల్లో అంతరిక్షంలో అలమర....నాసా

SMTV Desk 2017-10-20 18:00:03  space station, goods

వాషింగ్టన్, అక్టోబర్ 20 : ఆత్యాధునిక అలమర (వస్తువులు దాచి ఉంచుకునే పెట్టె)ను అంతరిక్ష కేంద్రంలో ఎనిమిది అలమరలుగా పొందుపరిచే వీలున్నట్లు నాసా వెల్లడించింది. హెచ్‌టీవీ–7గా పిలిచే ఈ అలమరను 2018 చివరి కల్లా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశపెట్టనున్నట్లు నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా) బుధవారం వెల్లడించింది. సైంటిస్టులు అంతరిక్ష కేంద్రంపైకి పరిశోధనలకు అవసరమయ్యే పరికరాలను తీసుకువెళుతుంటారు. అయితే అక్కడ మరిన్ని వస్తువులు దాయడానికి వీలుగా ఆధునిక పరికరాలతో అలమరను తయారు చేస్తున్నట్లు నాసా ప్రకటించింది. ఈ అలమరలో పరిశోధనలకు ఉపయోగపడే ప్రామాణిక ఈథర్నెట్‌ కేబుల్‌ వైర్లను ఉంచనున్నట్లు వివరించింది. కాగా, అలమరలను బోయింగ్‌ కంపెనీ తయారు చేస్తున్నట్లు తెలిపింది.