అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం..

SMTV Desk 2017-10-20 17:01:03   The firing range in Maryland, Emmarton Business Park in Edgewood, Jeffrey Geller.

వాషింగ్టన్, అక్టోబర్ 20 : అమెరికాలోని లాస్ వేగాస్ సంగీతోత్సవంలో జరిగిన కాల్పుల దృశ్యాలు మరవకముందే మళ్లీ అమెరికాలో మేరీల్యాండ్ లో కాల్పుల కలకలం రేగింది. ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి తన సహోద్యోగులపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటన ఎడ్జ్‌వుడ్‌లోని ఎమ్మార్టన్‌ బిజినెస్ పార్క్ లో బుధవారం చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉద్యోగులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. నిందితుడిని హర్ ఫోర్ట్ కౌ౦టీ పోలీస్ జెఫ్రీ గేలర్ గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.