డెన్మార్క్ ఓపెన్ లో ప్రణయ్‌ సంచలన విజయం..

SMTV Desk 2017-10-20 16:28:10   Denmark Open Badminton, HS Pranay is a sensational success.

ఒడెన్స్,అక్టోబర్ 21 : డెన్మార్క్ ఓపెన్ బాడ్మింటన్ లో భారత్ ఆటగాళ్ళకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మాజీ ప్రపంచ నెంబర్ వన్, మలేసియా క్రీడాకారుడు లీ చాంగ్ వీ పై 21-17, 11-21, 21-19 తేడాతో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సంచలన విజయం నమోదు చేశాడు. మరోపక్క అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్‌, 8వ సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ కూడా క్వార్టర్స్‌ చేరుకున్నారు. సైనా నెహ్వాల్ థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి జిందాపాల్‌పై 22-20,21-13తో, కిదాంబి శ్రీకాంత్‌.. కొరియా క్రీడాకారుడు జియోన్‌ జిన్‌పై 21-13,8-21, 21-18 తేడాతో విజయం సాధించారు. కాగా బి. సాయి ప్రణీత్, ఒలింపిక్ రజత పతక విజేత పివి సింధు, తొలి రౌండ్లోనే వెనుదిరిగారు.