ఫోర్బ్స్‌ ఇండియా జాబితాలో భారత్ టెక్ దిగ్గజాలు..

SMTV Desk 2017-10-20 15:56:54   Forbes India 2017, Top 10 List of Tech Billionaires.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20 : ఫోర్బ్స్‌ ఇండియా 2017 జాబితాలో టెక్ దిగ్గజాలకు చోటు దక్కింది. సాంకేతిక రంగంలో తమ సత్తా చాటుతూ లాభాల పంట పండిస్తున్న టెక్ దిగ్గజాల సంపద వేగంగా పెరుగుతుంది. ఈ జాబితాలో (ఆర్‌ఐఎల్‌) రిలయన్స్‌ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్‌ అంబానీ ఫోర్బ్స్‌ ఇండియా బిలియనీర్ల జాబితాలో నెంబర్‌ వన్‌గా నిలిచారు. ఇంకా రెండవ స్థానాన్ని ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ విప్రో అధినేత ఆజిమ్ ప్రేమ్ జీ దక్కించుకొన్నారు. ఇక ఫోర్భ్స్‌ బిలియనీర్ల జాబితా ప్రకారం టెక్‌ బిలియనీర్ల టాప్‌ 10 లిస్ట్‌లో శివ్‌ నాడార్‌(హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్ధాపకులు) ,సునీల్‌ మిట్టల్‌(భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌), అనిల్‌ అంబానీ( రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ అధినేత), ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి, దినేష్‌ నంద్వానా(వక్రంజీ వ్యవస్థాపకుడు), నందన్‌ నిలేకాని (నాన్ ఎక్జిక్యూటివ్ చైర్మన్ అఫ్ ఇన్ఫోసిస్), ఎస్‌ గోపాలక్రిష్ణన్ ‌(ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు) ఉన్నారు.