పర్యాటకులను ఆకర్షిస్తున్న శ్రీశైలం...

SMTV Desk 2017-10-20 14:52:03  srishailam, dam, Tourists, nagarjuna sagar, goverment , Drone camera

శ్రీశైలం, అక్టోబర్ 20 : మూడేళ్ల తరువాత శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండింది. వారం రోజుల క్రితం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన విషయం తెలిసిందే. పచ్చని కొండల మధ్య అంత ఎత్తు నుంచి కిందకు దిగుతున్న కృష్ణమ్మా పరువాళ్ళు చూసేందుకు రెండు కళ్ళు చాలవు. పాల నరుగా పోగుతో నీటి వయారాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు శ్రీశైలం తరలి వస్తున్నారు. అధికారులు నాగార్జున సాగర్‌ డ్యామ్‌కు నీటిని విడుదల చేయడంతో, గడిచిన 24 గంటల్లో 2.72లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 1,13,038 క్యూసెక్కులు ఉండగా.. 1,12,018 క్యూసెక్కులు ఔట్‌ఫ్లోగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.90 అడుగుల నీటిమట్టంతో నిండు కుండను తలపిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 209 టీఎంసీల నీరు నిల్వ ఉందని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. ఈ సుందర దృశ్యాలను ప్రభుత్వం డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించింది.