రానున్న ఎన్నికల్లోగా బృహత్తర పథకం...మోదీ సర్కారు కసరత్తు

SMTV Desk 2017-10-20 14:06:31  modi sarkar, Great plan

న్యూఢిల్లీ, అక్టోబర్ 20 : దేశంలో పేదరికాన్ని సంపూర్ణంగా నిర్మించే దిశగా కేంద్ర ప్రభుత్వం గృహతర పథకానికి ప్రణాళిక రూపొందిస్తుంది. దేశంలోని ప్రజలందరికి వర్తించేలా విశిష్ట సార్వత్రిక సామాజిక పథకాన్ని వచ్చే ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రధానైన మోదీ ప్రభుత్వం యోచిస్తుంది. తప్పనిసరి ఫించన్, మరణం, వైకల్యం, ప్రసుత్రి, వైద్య, అనారోగ్య, నిరుద్యోగ సేవలవంటి వాటిని ఉచితంగా లేదా తక్కువ ధరకు అందించేలా దీన్ని అందుబాటులో తేనున్నారు. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న 17 సామాజిక భద్రత పథకాల స్థానంలో ఈ అమలు చేయాలని కేంద్ర భావిస్తుంది. మొదట దేశ జనాభా 20% ఉన్న అత్యంత నిరుపేదలకు వర్తించేలా రూపొందిస్తున్న ఈ పథకానికి రూ. 20 వేలను వేచించానుంది. రెండో దశలో ఇతర వర్గాలకు లబ్ది చేకూర్చనుంది. అత్యంత నిరుపేదలకు ప్రభుత్వ నిధులనుంచి లబ్ధి కలిగించి మిగతా వర్గాలకు సొంతంగా కొత్త చందాలను వసూలు చేయాలని భావిస్తుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో గణనీయంగా ఈ పథకాన్ని తీర్చిదిదుతున్నట్లు సమాచారం.