భారత ఖగోళ శాస్త్రవేత్తకు గూగుల్‌ గౌరవం

SMTV Desk 2017-10-20 12:42:45   Astronomer, Subrahmarinan Chandrasekhar, Google Doodle, Nobel Prize

న్యూఢిల్లీ, అక్టోబర్ 20 : నక్షత్రాల పరిణామ సిద్దాంతాన్ని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ జయంతి నేడు. ఈ సిద్దాంతానికి గాను ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. తన 107 వ జయంతిని పురస్కరించుకొని గూగుల్ డూడుల్ ను పెట్టి ఆయనను గౌరవించింది. ఈయన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సీవీ రామన్ కు మేనల్లుడు. సుబ్రహ్మణ్యన్‌ పాకిస్థాన్‌లోని లాహోర్‌లో 1910 అక్టోబర్‌ 19న ఓ తమిళ కుటుంబంలో జన్మించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో చదివిన ఈయన అమెరికా వెళ్ళేంత వరకు కేంబ్రిడ్జి యూనివర్సిటీ(1936)లో చదివారు. అనతరం చికాగోలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఈ ఇండో-అమెరికన్‌ ఖగోళ భౌతికశాస్త్రవేత్త నక్షత్రాల్లోనూ పరిణామ దశ ఉందన్న అంశాన్ని కనుగొన్న౦దుకు గాను ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.