కివీస్ విజయం...

SMTV Desk 2017-10-20 12:14:02  new zealand, india, cricket match, ibp match

ముంబై,అక్టోబర్ 20 : భారత్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తో జరిగిన రెండో మ్యాచ్ లో కివీస్ విజయం సాధించింది. భారత్ జట్టులో ఉనద్కత్ అల్ రౌండర్ షో తో అలరించిన మ్యాచ్ ను గెలిపించలేకపోయాడు. ప్రత్యర్ధి జట్టులో లాథమ్(108), టేలర్(102) సెంచరీలతో కదం తొక్కడంతో కివీస్ జట్టు 343 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య చేధనలో బ్యాటింగ్ కు దిగినా బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బే తగిలింది.‌ రిషబ్ పంత్, పృథ్వీ షా వెంట వెంటనే పెవిలియన్ కు చేరడంతో జట్టు కష్టాల్లో పడింది. అయితే కరుణ్ నాయర్ 53, గురుకీరత్ సింగ్ మాన్ 65 పరుగులతో రాణించడంతో లక్ష్యం ఛేదించేలా అనిపించింది. ఈ క్రమంలో కివీస్ బౌలర్లు చెలరేగడంతో 47.1 ఓవర్లలో 310 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ -కివీస్ మద్య తొలి వన్డే ఆదివారం ముంబై వేదిక గా జరగనుంది.