దీపావళికి శునకాల పూజ...

SMTV Desk 2017-10-20 12:03:43  nepal, diwali, tihar festival in nepal,

నేపాల్, అక్టోబర్ 20: మన సాంప్రదాయ ప్రకారం దీపావళి పండుగ అనగానే దీపాలు వెలిగించి, టపాసులు పేల్చుకోవడం. కానీ అక్కడ దీపావళి అంటే జంతువులకు పూజ చేయడం ప్రత్యేకత. వివరాల్లోకి వెళితే... నేపాల్ లో జరిగే ఐదు రోజుల తిహార్ పండుగను, భారత్ లో దీపావళి జరుపుకునే రోజే నేపాలి హిందువులు జరుపుకుంటారు. ఈ పండుగలో మొదటి రెండు రోజులు జంతువులను పూజిస్తారు. అందులో ప్రధానంగా మొదటి రోజు కాకులను, రెండో రోజు కుకుర్ తిహార్ పేరుతో శునకాలకు చేసే పూజ ఈ పండగలో హైలైట్‌గా నిలుస్తుంది. ఈ పూజలో భాగంగా వాటికి బొట్లు పెట్టి, దండలు వేసి, వాటికి ఇష్టమైన ఆహారం పెడతారు. ఈ పండుగ ఒక నేపాల్ లోనే కాకుండా భారత్‌లోని అస్సాం, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా జరుపుకుంటారు. మనుషులకు, జంతువులకు మధ్య ఉండే బంధాన్ని ఈ విధంగా జరుపుకోవడం అందరినీ ఆకట్టుకు౦టు౦ది.