పార్టీ మార్పు కై టీడీపీ భవన్ కు బయల్దేరిన రేవంత్ రెడ్డి...!

SMTV Desk 2017-10-20 11:31:04  revanth reddy,tdp leader,tdp bavan,

హైదరాబాద్, అక్టోబర్ 20: పార్టీలు పొత్తులు పెట్టుకుంటే తప్పేంటి ? కాంగ్రెస్ పార్టీలోకీ చేరనున్న టీడీపీ ప్రెసిడెంట్ ? అంటూ గత రెండు రోజులుగా తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ఆయన ఖండిస్తూ వచ్చినప్పటికీ, పార్టీ మారడం మాత్రం ఖాయమని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన టిడిపి కార్యవర్గ సమావేశానికి బయల్దేరారు, కాగా టీడీపీ భవన్ లో జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి పార్టీ మార్పుల విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.