నేడు కివీస్ తో రెండో వార్మప్ మ్యాచ్..

SMTV Desk 2017-10-19 13:58:01   One Day Series, india, kivis, newziland.

ముబి, అక్టోబర్ 19 : భారత ద్వితీయ శ్రేణి జట్టుతో మొన్న జరిగిన మ్యాచ్ ఓటమితో కివీస్ కి వాస్తవ పరిస్థితి అర్థమైంది. బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌తో రెండో సన్నాహక మ్యాచ్‌ ఈ రోజు ముంబైలో జరుగనుంది. ఈ సరైన గెలుపుతో తమ తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవడంతో పాటు వన్డే సిరీస్‌కు ముందు ఫామ్‌ అందుకోవాలని న్యూజిలాండ్‌ జట్టు భావిస్తుంది. మరో విజయంతో సెలెక్టర్ల దృష్టిలో పడాలని భారత ఆటగాళ్ళు చూస్తున్నారు. ప్రస్తుత ఫామ్ పరంగా భారత్ ను ఎదుర్కోవడం న్యూజిలాండ్‌ కు పెద్ద సవాలే అని చెప్పవచ్చు.