పుత్తడి ధరకు రెక్కలు...

SMTV Desk 2017-10-18 20:04:46  gold prize hiked, diwali, delhi, gold

న్యూఢిల్లీ, అక్టోబర్ 18 : దీపావళి పండుగ వేళ బంగారు ధరకు రెక్కలు వచ్చాయి. పుత్తడి ధర నేడు అమాంతంగా రూ.290 పెరిగింది. 10 గ్రాముల పుత్తడి ధర రూ.31వేల చేరి, మూడు వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ. 31వేల చేరిందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర స్థిరంగా ఉంది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లేకపోవడంతో కిలో వెండి రూ.41,000గా ఉంది. అంతర్జాతీయంగా పసిడి ధర 0.12శాతం తగ్గి ఔన్సు 1,283.20 డాలర్లుగా నమోదైంది.