బ్యాగ్ లో నుంచి ఫోన్ కొట్టేస్తూ రాజ్ తరుణ్...

SMTV Desk 2017-10-18 19:08:07  Raj tharun, Rajugadu first look, latest updates

హైదరాబాద్, అక్టోబర్ 18: రాజ్ తరుణ్ కథానాయకుడిగా సంజనా రెడ్డి దర్శకత్వంలో ‘ రాజుగాడు ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రామ బ్రహ్మ సుంకర నిర్మాతగా వహిస్తున్నారు. రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను దీపావళి పండుగ సందర్బంగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో రాజ్ తరుణ్, అమైరా దస్తుర్ ను కౌగిలించుకొని, ఆమె బ్యాగ్ లోని సెల్ ఫోన్ ను కొట్టేస్తూ కనిపించాడు. సంక్రాంతికి కానుకగా ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుంది.