ఇక ఆన్‌లైన్‌ లో ఐటీ సేవలు

SMTV Desk 2017-10-18 19:05:42  IT Deportment, online services, official website,

న్యూఢిల్లీ, అక్టోబర్ 18 : పత్యక్ష పన్నులు, ఇతర పన్నులకు సంబంధించిన సమాచారాన్ని, సందేహాలను దృష్టిలో ఉంచుకొని ఐటీ శాఖ ఆన్‌లైన్‌ ఛాట్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా పన్ను చెల్లించే వ్యక్తులకు వచ్చే సందేహాలను నేరుగా నిపుణులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను అధికారిక వెబ్ సైట్ లో "లైవ్‌ ఛాట్‌ ఆన్‌లైన్‌-ఆస్క్‌ యువర్‌ క్వైరీ" అనే ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ ఓపెన్ చేయగానే అక్కడ పన్ను చెల్లింపుదారుడు అడిగే ప్రశ్నకు ఐటీ శాఖకు చెందిన ఒక అధికారి సమాధానాలు ఇస్తారు. త్వరలోనే ఆదాయపు పన్ను శాఖ పనితీరు గురించి తెలుసుకునేందుకు అభిప్రాయాలను సేకరించే౦దుకు మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆదాయపన్ను అధికారిక వెబ్ సైట్ www.incometaxindia.gov.in