కూతుర్ని హెంగర్ కి తగిలించిన తల్లి....

SMTV Desk 2017-10-18 18:52:16  china, hunger, china

బీజింగ్, అక్టోబర్ 18 : పిల్లలు అల్లరి చేయడం సాధారణమే దానికి తల్లిదండ్రులు చిన్న చిన్న చిలిపి శిక్షలు వేస్తుంటారు. మరి ఇటువంటి విచిత్ర సంఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. చైనాకు చెందిన ఓ తల్లి తన కూతురు వర్షంలోకి వెళ్లి తడుస్తూ అల్లరి చేయడం గమనించింది. దాంతో ఆ తల్లి కూతురు బట్టలు మార్చడానికి బదులు కూతుర్నే హెంగర్ కి తగిలించింది. ముందుగా ఆమె ఒక ప్లాస్టిక్ సంచి తీసుకొని దానిలో కూతురిని కూర్చొబెట్టి దానిని హెంగర్ కు తగిలించి, ఎండలో ఆరబెట్టేసింది. దీనికి సంబ౦ధించిన వీడియోలు, ఫొటోలు నెట్ లో వైరల్ గా మారాయి.