వాట్సప్ లో మరో కొత్త ఫీచర్..

SMTV Desk 2017-10-18 18:33:38  whats app, live location, new feauture, android, i phone

న్యూఢిల్లీ, అక్టోబర్ 18 : వాట్సప్ లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. “లైవ్ లొకేషన్” పేరుతో వచ్చిన ఫీచర్ లో ప్రస్తుతం మనం ఎక్కడున్నామన్న విషయాన్ని మన కుటుంబ సభ్యులకు సులభంగా పంపించే సౌలభ్యాన్ని వినియోగదారులకు అందించనున్నారు. ఇదివరకు కేవలం లొకేషన్ ను మాత్రమే షేర్ చేసే అవకాశం ఉన్న వాట్సప్ లో ప్రస్తుతం మనం ఎంత దూరంలో ఉన్నామో వారు ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటును కల్పించింది. ఒకసారి లైవ్ లొకేషన్ షేర్ చేస్తే, బ్యాగ్రౌండ్‌లో యాప్‌ రన్‌ అవుతున్నా ఈ ఫీచర్‌ పని చేయడం విశేషం. గ్రూప్ ఛాట్ లో లైవ్ లొకేషన్ ను ఒకరు షేర్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఏయే ప్రాంతాల్లో ఉన్నారనేది కూడా ఆ మ్యాప్ లో కనిపిస్తుంది. అంతేకాదు ఎంత సమయం పడుతుందో కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.