రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ పిలుపు

SMTV Desk 2017-06-07 19:40:02  telangana state agriculture , kcr,libraries chairman

హైదరాబాద్, జూన్ 07 : తెలంగాణ ఉద్యమంలో, ఎలాగైతే పట్టుదలతో ముందుకు సాగమో, అలానే పార్టీ కార్యక్రమాల్లో పనిచేసినట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ఇటీవల వివిధ పదవులకు సంబంధించి నియామకమైన నాయకులు, వారి అనుచరులు మంగళవారం ప్రగతి భవన్ లో సమావేశమైన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని అభినందించి, కొత్తగా లభించిన పదవుల ద్వారా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి ముఖ్యమంత్రి కలిసిన వారిలో జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్లు, ఆర్గనైజర్లు, పార్టీ అనుబంధ సంఘాల అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.