ప్రముఖ గాయని హత్య....

SMTV Desk 2017-10-18 18:22:40  haryana singer harshitha dahiya, Murder,police

చండీగఢ్, అక్టోబర్ 18: హర్యానాకు చెందిన ప్రముఖ గాయని హర్షితా దాహియా(22) మంగళవారం దారుణంగా హత్య చేయబడింది. పానిపట్ జిల్లాలో చమ్రారా ప్రాంతంలో ప్రదర్శన ఇచ్చి వస్తున్నా హర్షితా పై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి వాహనంలోనే చంపి పారిపోయారు. అయితే ఇటీవల తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని హర్షితా ఒక వీడియోని యూట్యూబ్ లో విడుదల చేసింది. అది విడుదల చేసిన కొద్ది రోజులకే ఆమె హత్యకు గురి కావడం గమనార్హం. కాగా తాజాగా జరిగిన ఈ ఘటనలో మృతురాలి సోదరి లత కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హర్షితను చంపింది తన భర్తే అని ఆమె పోలీసులకు తెలియజేసింది. మా అమ్మ హత్యకేసులో హర్షితనే సాక్షి అందుకే ఆమెను చంపాడని అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకేసారి ఈ రెండు హత్య కేసులను దర్యాప్తు చేస్తున్నారు.