‘సెల్యూట్ మోదీ’ ట్వీట్ వెనక్కి : కమల్

SMTV Desk 2017-10-18 16:42:51  kamal hasan, narendra modi,

చెన్నై, అక్టోబర్ 18: పెద్ద నోట్ల రద్దును తొందరపడి సమర్థించాను అంటూ సీని నటుడు కమల్ హసన్ అంటున్నారు. తాజాగా తమిళ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకపోగా, వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నోట్ల రద్దుతో నల్లధనం తొలిగిపోతుందని అనుకున్నాను కానీ, ఇప్పుడిప్పుడే సమాజంలో నెలకున్న సమస్యలు అర్థమవుతున్నాయని, ఈ నిర్ణయానికి మద్దతిచ్చినందుకు క్షమించండి అని ఆర్టికల్ లో పేర్కొన్నారు. కమల్ కొత్త పార్టీ పెడుతున్న నేపధ్యంలో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.