వివాహిత పై అత్యాచారం

SMTV Desk 2017-06-07 19:01:13  auto drivar, women

న్యుడిల్లీ, జూన్ 07 : యూపీ లోని గుర్గావ్ లో దారుణం జరిగింది. 9 నెలల శిశువు ను చంపి ఆమె పై అత్యాచారం చేసారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక వివాహిత మే నెల 29 న తన భర్త పొరుగు వారితో గొడవ పడి ఇల్లు వదిలి వెళ్లి పోయాడు. ఇక ఇంట్లో తానొక్కతే ఉండడానికి భయపడిన ఆమె అదే రోజు రాత్రి మనేసర్ నుంచి అత్తవారు ఉండే ఖందన్ కు ఆటోలో బయల్దేరింది. ఆటోలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఒకరు ఆమె బిడ్డను వెళ్ళుతున్న అటోలోంచి బయటకు విసిరాడు. ఆ శిశవు అక్కడికక్కడే చనిపోయాడు. బిడ్డ మృతదేహంతో ఆమె పుట్టిన దక్షిణ డిల్లీ కి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఆమె భర్త తో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చి వారిపై పిర్యాదు చేసింది.