ఏపీలో డేరా బాబాగా అవతారమెత్తిన పాస్టర్...

SMTV Desk 2017-10-18 15:58:48  west godavari, crime, latest updates,Christian faster

పశ్చిమ గోదావరి, అక్టోబర్ 18: క్రైస్తవ గురువు దైవం పేరిట అమ్మాయిలను లోబర్చుకోవడంలో తనకు తానే దిట్ట అని నిరూపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాధపురం గ్రామంలో ఒక చర్చిలో పాస్టర్ గా పనిచేసే ఎబినేజర్, దైవం పేరుతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడు. దేవుణ్ణి ప్రార్థించుకోడానికి వెళితే చాలు.. మాయమాటలతో, మత్తు చల్లి అతని కైవసం చేసుకుంటాడు. అతని కళ్లలోకి చూస్తే.. అంతే అమ్మాయిలు అతని వశం అయిపోతారు. ఇలా ఎంతో మంది యువతులను, మహిళలను తన బంధిలో పెట్టుకున్నాడు. ఈ విషయంపై స్పందించిన మహిళా కమీషనర్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ... కరుణామయుడు అంటూ ప్రార్థి౦చే గురువే పాపాత్ముడిలా మారాడని ఆవేదన వ్యక్తం చేశారు. పాస్టర్ ఎబినేజర్ మాయలో బందీగా ఉన్న బాధితులను వారి కుటుంబాలకు చేరుస్తామని, సమస్యలకు కన్నీళ్ళు పరిష్కారం కావని భరోసా ఇచ్చారు. వెంటనే ఎబినేజర్ ను అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశించారు. ఆ తర్వాత గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.