పర్యావరణ హిత పండగ చేసుకోండి : పవన్

SMTV Desk 2017-10-18 15:14:25  Pavan kalyan, Janasena party, Diwali wishes.

హైదరాబాద్, అక్టోబర్ 18 : జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా “ఈ దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకొండి. అలాగే హాని కలిగించని బాణాసంచాను మాత్రమే కాల్చండి” అంటూ అభిమానులకు సూచించారు. పవన్ ప్రస్తుతం తన 25 వ సినిమా చిత్రీకరణలో బీజీగా ఉన్నారు. ఇటీవల ఆ చిత్రానికి "అజ్ఞాతవాసి" అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.