పెళ్లికి కట్నంగా కిడ్నీ..!

SMTV Desk 2017-10-18 14:24:33  bihar, love incident, kidney was willing to sell.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18 : డిల్లీలో ఓ యువతి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఎవరు చేయని సాహసానికి సిద్దపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్ కి చెందిన 21 ఏళ్ల యువతికి కొన్ని నెలల క్రితమే పెళ్లయింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య గొడవల కారణంగా విడిపోయారు. ఆ తరువాత ఆమె మళ్లీ మరో వ్యక్తితో ప్రేమలో పడి అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంది. కానీ అందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకోగా ప్రేమించిన వ్యక్తి నాకు డబ్బు ఇస్తేనే పెళ్లి చేసుకుంటాననడంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. దాంతో కిడ్నీ అమ్మడానికి సిద్దపడింది. ఢిల్లీలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కిడ్నీ దానం చేయాలనుకుంటున్నా అని చెప్పగా అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను తీసుకెళ్ళి విచారించగా ఆమె అసలు నిజం చెప్పింది. దీంతో ఖంగు తిన్న పోలీసులు ఆ వ్యక్తి మీద ఫిర్యాదు రాసివ్వమన్నారు. కాని అందుకు ఆమె నిరాకరించి మళ్లీ బీహార్ వెళ్ళిపోయింది.