క్రికెటర్ యువరాజ్ పై కేసు..

SMTV Desk 2017-10-18 13:25:42  cricketer yuvaraj singh, Domestic violence case, Brother Zorawar, mom Shabnam Singh

న్యూఢిల్లీ, అక్టోబర్ 18 : భారత క్రికెట్ ఆటగాడు యువరాజ్ పై గృహ హింస కేసు నమోదైంది. . యువీతో పాటు అతని సోదరుడు జొరవర్, మాతృమూర్తి షబనమ్ సింగ్‌పైన కూడా కేసును నమోదు చేశారు. చాలా రోజులుగా జొరవర్, ఆకాంక్షలు వేరు వేరుగా ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఎవరి వద్ద ఉండాలన్న దానిపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది. అయితే గృహ హింస కేసులో యువరాజ్‌పై ఎలా కేసు నమోదు చేస్తారని ప్రశ్నించగా.. ‘శారీరక హింస కింద మాత్రమే ఈ కేసు నమోదు చేయరు.. మానసిక, ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చిన వారిపై, అందుకు సహకరించిన వారిపై కూడా ఈ కేసు నమోదు చేయవచ్చు. ఈ విషయంలో యువీ తమ కుటుంబ వ్యక్తులకు మద్దతు తెలుపుతున్న కారణంగా అతడిపై కేసు పెట్టాల్సి వచ్చిందని ఆకాంక్షా శర్మ తరపున వాదిస్తున్న న్యాయవాది స్వాతి సింగ్ మాలిక్ తెలిపారు.