బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్..

SMTV Desk 2017-10-18 12:48:44  Bharat Telecom Industry BSNL, Mobile manufacturer Micromax, updates.

న్యూఢిల్లీ,అక్టోబర్ 18 : భారత్ ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం ప్రముఖ మొబైల్ తయారీదారి సంస్థ మైక్రోమాక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. నెలకు రూ.97 తో రీఛార్జి చేస్తే అపరిమిత కాలింగ్ తో పాటు కొంత డేటాను ఇస్తుంది. అయితే ఈ ఆఫర్ అందరికి కాదండోయ్.! ఎవరైతే మైక్రోమాక్స్‌ 4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్‌ ఫోన్‌ ‘భారత్‌–1’ వాడుతారో వారికే మాత్రమే అంటూ షరతును విధించింది. ఈ ఫోన్ ధర 2,200 కాగా అక్టోబర్ 20 నుండి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ 3జీ సర్వీసులను మాత్రమే యూజర్లకు అందిస్తుంది. వచ్చే సంవత్సరం జనవరి నుంచి 4 జీ సేవలను ప్రారంభి౦చనున్నట్లు సమాచారం.