కన్న తండ్రి కాదు.. కసాయి తండ్రి

SMTV Desk 2017-10-18 12:32:16  kamareddy, crime, latest updates

కామారెడ్డి, అక్టోబర్ 18: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా ఎండ్రియాల్ గ్రామానికి చెందిన బాలయ్య, తన కుమార్తె శ్రీజ(16)ను గొడ్డలితో నరికి చంపాడు. కన్న తండ్రి కసాయిగా ప్రవర్తించి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం పరారయ్యాడు. అసలు ఎందుకు చంపాడు ? అనే కారణాలు తెలియాల్సి వుంది. స్థానిక ప్రాంతంలో ఈ ఘటన కలకలం రేపుతుంది.