కివీస్ కు ఓటమి..

SMTV Desk 2017-10-18 12:01:08   Bharat Board Presidents Eleven, New Zealand, Shriras Iyer, Cricket updates.

ముంబై ,అక్టోబర్ 18 : భారత్ బోర్డ్‌ ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌కు పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్ లో అన్ని రంగాల్లో రాణించిన శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని బోర్డు జట్టు, 30 పరుగులు తేడాతో విజయం సాధించింది. కరుణ నాయర్(78), కేఎల్ రాహుల్(68), పృథ్వీ షా(66) రాణించడంతో బోర్డు ఎలెవన్ జట్టు 9 వికెట్లకు 295 పరుగులు చేయగా.. కివీస్‌ 47.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (5/38) తో ఆకట్టుకున్నాడు. ఈ జట్ల మద్య రెండో వార్మప్ మ్యాచ్ గురువారం జరగనుంది.