స్లిప్ లో తొమ్మిది మంది ఫీల్డింగ్..

SMTV Desk 2017-10-18 11:17:14  Ranji match, Bengal, Chhattisgarh match, criket updates.

హైదరాబాద్, అక్టోబర్ 18 : రంజీ మ్యాచ్ ల్లో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. క్రికెట్ జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఉండగా అందులో 9 మందిని ఏకంగా స్లిప్ లో ఫీల్డింగ్ పెట్టడం అంటే వింతే.. ఈ ఘటన బెంగాల్‌ - ఛత్తీస్‌ఘడ్‌ మధ్య రాయపూర్‌లో జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకుంది. బెంగాల్ పేస్ బౌలర్లు అశోక్ దిండా, మొహమద్ షమీ బౌలింగ్ లో, వికెట్ కీపర్ సహా జట్టంతా సర్కిల్ లో ఉండడం గమనార్హం..ఈ మ్యాచ్ లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ను 529/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా ఛత్తీస్‌ఘడ్‌ 110 పరుగులకే ఆలౌటైంది. తరువాత షమీ, దిండాలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఛత్తీస్‌ఘడ్‌ రెండో ఇన్నింగ్స్‌ 259 పరుగులకే కుప్పకూలడంతో బెంగాల్ ఇన్నింగ్స్ మిగిలి ఉండగానే 160 పరుగుల తేడాతో విజయం సాధి౦చింది.