ప.గో. జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

SMTV Desk 2017-10-18 10:36:43  West Godavari, Aqua Factory in Tundur, Hunger Strike.

పశ్చిమ గోదావరి, అక్టోబర్ 18 : ప.గో. జిల్లాలోని బేతపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుందుర్రులో ఆక్వా ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు, పోరాట కమిటీ గత నాలుగు రోజులుగా నిరాహారదీక్ష చేపట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల దీక్షను భగ్నం చేసి దాదాపు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసుల చర్యను నిరసన కారులు అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఆందోళన కారులను అడ్డుకున్నారు. దీక్షలో కూర్చున్న వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఆసుపత్రి వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.