‘ఖాకి’ ట్రైలర్ విడుదల...

SMTV Desk 2017-10-17 19:29:55  karthi, rakul preeth singh, khaki triler release,

హైదరాబాద్, అక్టోబర్ 17: తమిళ హీరో కార్తి కథానాయకుడిగా ‘ఖాకి’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కార్తీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ చిత్రానికి హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి పండుగ సందర్బంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘ తూర్పు గోదావరి జిల్లా, రావులపాలెంలో జాతీయ రహదారి ప్రక్కన జనసంచారం లేని ఇంట్లో జరిగిన...’ అంటూ యాక్షన్ దృశ్యాలకి ప్రాధాన్యమిస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ ట్రైలర్ లో కార్తీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఆదరగోట్టేసాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గిబ్రన్ స్వరాలు సమకూర్చారు.