కామెంట్లపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ..

SMTV Desk 2017-10-17 19:16:41  DIRECTOR RAM GOPAL VARMA, MLA PRABHAKAR, CONVERSATION.

హైదరాబాద్, అక్టోబర్ 17 : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించనున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా అనేక వివాదాలకు దారీ తీస్తోంది. ఈ తరుణంలో తాజాగా టీడీపీ ఎమెల్యే ప్రభాకర్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై వర్మ స్పందిస్తూ... ఎమ్మెల్యే చౌదరి చేసిన కామెంట్స్ కు నా సమాధానాలు.. అంటూ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. *వారిద్దరి మధ్య మధ్య సంభాషణ.. చౌదరి : రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఓ సైకో. వర్మ : అవునా డాక్టర్ గారు.. మీకు సైకియాట్రీ మీద డిగ్రీ కూడా ఉందా? అరెరే మీరు చదువు రాని వారనుకున్నాను. చౌదరి : కులాల మధ్య, రాజకీయాల మధ్య ఇష్టం వచ్చినట్లు సినిమాలు తియ్యకూడదు. వర్మ : అంటే ఇష్టం లేనట్టు తీస్తే, ఓకేనా డాక్టర్ గారు? చౌదరి : రామారావు వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేసే విధంగా మూవీ ఉండాలి. వర్మ : ఛా.., మా నాయనే.. ఎవరికి తట్టని ఎంత గొప్ప మాట చెప్పావు చౌదరి.. నీ కడుపు చల్లగుండ చౌదరి : ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి మచ్చ కలిగే రీతిలో ఏమి తీసినా తగిన మూల్యం చెల్లించుకుంటావు వర్మ : అంటే మీ జేబులనిండా డబ్బులు నింపితే ఎన్టీఆర్ గారిని తిట్టినా పర్వాలేదా? నీ తస్సాదియ్యా..! చౌదరి : నా సినిమా నా ఇష్టం అంటే చూస్తూ ఊరుకోం. వర్మ : ఊరుకోక డాన్స్ చేస్తారా సార్? లేక పాట కూడా పడతారా? చౌదరి : లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వెనుక వైసీపీ హస్తం ఉంది. వర్మ : ఆ హస్తం వెనక మీ హస్తం ఉందా సార్? లేకపోతే మీకెలా తెలుసు ఎవరి వెనుక ఎవరున్నారో? ఈ కామెంట్లను అర్ధం చేసుకునే మైండ్ మీకు లేకపోతే నేను మిమ్మల్ని అలా వెనక్కి తీసుకెళ్లి చెప్తా. అంటూ వారిద్దరి మధ్య సంభాషణ కొనసాగింది.