విశాఖలో చంద్రబాబు పర్యటన

SMTV Desk 2017-10-17 17:57:43  Vishakapatnam, AP CM, Chandrababu Naidu

విశాఖ, అక్టోబర్ 17 : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన నిమిత్తం ఒక ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్ ను ప్రారంభించిన అనంతరం ఎన్‌ఏడీ దగ్గర ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఫ్లైఓవర్‌ పనులు రెండేళ్లలోపు పూర్తి చేస్తామని, సాగర తీరంలో టీయూ-12 యుద్ధ విమాన ప్రదర్శనశాలను ప్రారంభించారు. విశాఖను అతి సుందర నగరంగా తీర్చి దిద్దుతామని, అమెరికా పర్యటనకు వెళ్ళాల్సి ఉన్నా విశాఖ నగరం మీద అభిమానంతో శంకుస్థాపనకు వచ్చినట్లు వెల్లడించారు. కాగా రూ.113 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్‌ కాంట్రాక్టు నిర్మాణాన్ని విజయ్ నిర్మాణ సంస్థ దక్కించుకుంది.