తాజ్ మహల్ కట్టడం భారతీయుల శ్రమ : యూపీ సీఎం

SMTV Desk 2017-10-17 17:36:22  taj mahal, up cm, yogi adhithyanath, sensational comments

లక్నో, అక్టోబర్ 17 : ప్రముఖ చారిత్రాత్మక కట్టడం, ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజ్ మహల్ ను కట్టించిన మొఘల్‌ చక్రవర్తులు దోశద్రోహులంటూ ఇటీవల ప్రముఖ భాజపా నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదం ఇంకా కొనసాగుతు౦డగానే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ కట్టడాన్ని సందర్శించనుండటం గమనార్హం. అయితే తాజ్‌మహల్‌ వివాద౦పై యూపీ సీఎం యోగి స్పందిస్తూ.. తాజ్ మహల్ ను ఎవరు, ఎందుకు కట్టించారనేది అనవసరమైన చర్చ అని.., ఆ కట్టడాన్ని భారతీయ కార్మికుల రక్తం, చెమటతో నిర్మించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు సరైన సదుపాయాలు, భద్రత కల్పించడం మన బాధ్యత అన్నారు. కాగా, తాజ్ మహల్ ను సందర్శించడానికి యోగి ఈ నెల 26 వ తేదీన ఆగ్రా వెళ్లి అక్కడి కోటను సందర్శించనున్నారు.