రంజీల్లో అరుదైన రికార్డు....

SMTV Desk 2017-10-17 17:19:34  Ranji Trophy, gova, himachalpradhesh, jaiswall records

న్యూఢిల్లీ, అక్టోబర్ 17 : రంజీ ట్రోఫీలో భాగంగా సోమవారం ధర్మ శాలలో గోవా -హిమాచల్ ప్రదేశ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో జైశ్వాల్ 16 బంతుల్లో ఆర్ధశతకాన్నినమోదుచేశాడు. దీంతో భారత్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో వేగవంతమైన అర్ధ శతకాన్ని నమోదు చేసిన రెండో ఆటగాడిగా జైశ్వాల్‌ రికార్డులకెక్కాడు. ఇంతకు ముందు 2015లో జమ్ముకశ్మీర్‌కు చెందిన బన్‌దీప్‌ సింగ్‌ 15 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. హిమాచల్ ప్రదేశ్ కి చెందిన జైశ్వాల్ తొలి ఇన్నింగ్స్ లో 20 బంతుల్లో 63 పరుగులు చేయడం జరిగింది.