19న ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ ఫస్ట్ లుక్..!

SMTV Desk 2017-10-17 16:54:14  nani, sai pallavi, middile class abbayi,

హైదరాబాద్, అక్టోబర్ 17: ప్రేమ కథ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నాచురల్ స్టార్ నాని, ప్రస్తుతం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రంలో నటిస్తున్నారు. నాని సరసన సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే అసలు విషయం ఏటంటే.. దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేస్తారట. ఈ విషయం ఎంత వరకు నిజమో తెలియాల్సి వుంది. సహజంగా నటించే ఈ ఇరువురి జంటను తెరపై చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.