వధువుకి తిరిగిచ్చిన కట్నం.....

SMTV Desk 2017-10-17 16:38:48  Bihar cm nithish kumar, Dowry, ara dist

పట్న, అక్టోబర్ 17 : దేశంలో వరకట్న వేధింపులు పెరుగుతున్న కొద్దీ ఆడ పిల్లల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్న ఈ రోజుల్లో వరుడికి ఇచ్చిన కట్నం తిరిగి ఇస్తే. సమాజం దృష్టిలో ఇది ఓ అద్భుతమే... ఇలాంటి అద్భుతంతో బీహార్‌కు చెందిన ఓ కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇటీవల కట్నం తీసుకోవద్దంటూ బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఇచ్చిన పిలుపునకు ఈ కుటుంబం స్పందించింది. బీహార్‌లోని అరా జిల్లాకు చెందిన మాజీ ప్రిన్సిపాల్‌ హ్రింద సింగ్‌ తనయుడు ప్రేమ్‌ రంజన్‌ సింగ్‌ వివాహం డిసెంబరు 3వ తేదీన జరగనుంది. ఇందుకోసం వధువు కుటుంబం నుంచి పెళ్లి ఖర్చుల నిమిత్తం హ్రింద రూ.4లక్షలు తీసుకున్నారు. అయితే.. బిహార్‌ వాసులు కట్నం తీసుకోవద్దని సీఎం నితీశ్‌ కుమార్‌ ఇటీవల పిలుపునిచ్చారు. దీంతో తన కుమారుడి పెళ్లికి కట్నం కింద తీసుకున్న నగదును పెళ్లికూతురు కుటుంబానికి తిరిగి ఇచ్చారు. దీనిపై వధువు సోదరుడు రోహిత్‌ సింగ్‌ స్పందించారు. ‘కట్నం కింద తీసుకున్న నగదు తిరిగి ఇచ్చేయడానికి వరుడు కుటుంబసభ్యులు మా ఇంటికి రావడంతో పెళ్లి రద్దుచేసుకుంటారేమోనని అని కంగారు పడ్డాను. కానీ విషయం తెలిసి.. నా సోదరి ఇటువంటి మంచి కుటుంబంలోని వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.