‘ఆకాశ వీధిలో అందాల జాబిలి’ కి.. హ్యాపీ బర్త్ డే..

SMTV Desk 2017-10-17 16:08:49  keerthy suresh, mahanati first look,

హైదరాబాద్, అక్టోబర్ 17: ‘ఆకాశ వీధిలో అందాల జాబిలి’ పేరుతో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ‘మహానటి’ సినిమాలోని సావిత్రి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ ను నేడు కీర్తి సురేశ్ పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్ర బృందం సామాజిక మాధ్యమంలో విడుదల చేసింది. సావిత్రి పాత్రను పోషించిన కీర్తి కళ్లను ఈ ఫస్ట్ లుక్ లో నెటిజన్లు చూసి.. నిజంగా సావిత్రా ? కీర్తి సురేశ్ ఫోటో నా ? అని అవాక్కయ్యారు. ఈ ఫోటోలో కీర్తి కళ్ళు ఎంతో సౌందర్యంగా, ఒకరి కోసం ఎదురు చూసే చూపు, అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సమంత కీలక పాత్రలో, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, విజయ దేవరకొండ, షాలిని పాండేలు కూడా ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.