ఫుట్ బాల్ ఆటలో విషాదం ...

SMTV Desk 2017-10-17 12:00:41  Jakarta, Chest pain, Midfielder Raman Rodriguez

జకార్తా ,అక్టోబర్ 17 : వినోదం కోసం జరిగే ఆటలలో ఇటీవల విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.. ఈ సారి విషాద ఘటన జకార్తా లోని ఫుట్ బాల్ మ్యాచ్ లో చోటు చేసుకుంది. ఇండోనేసియా దిగ్గజ ఆటగాడు కోయిరుల్‌ హుదా ఆట మధ్యలో సహచరుడు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు. జకార్తాలో ఈ నెల 15న మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు ప్రమాదవశాత్తు మిడ్‌ ఫీల్డర్‌ రామన్‌ రోడ్రిగ్జ్‌ (బ్రెజిల్‌)ను ఢీ కొనగా అతడు కుప్పకూలిపోయి, ఛాతి నొప్పితో విలవిల్లాడి పోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. సహచరుణ్ని గట్టిగా ఢీ కొట్టాక హుదా శ్వాస తీసుకోలేకపోవడంతో, అతడికి గుండెపోటు వచ్చిందని వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.