పొదల్లో ఐదు మృతుదేహాలు లభ్యం...

SMTV Desk 2017-10-17 11:44:05  hyderabad, kolluru, narsinghi, sangareddy, suside attempt

హైదరాబాద్, అక్టోబర్ 17: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక కుటుంబ సభ్యులు అంతా కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నార్సింగి కొల్లూరు ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంగా రెడ్డి జిల్లా అమీనా పూర్ కు చెందిన ఒక ఇంటి కుటుంబ సభ్యులు అయిన ముగ్గురు మహిళలు, నాలుగేళ్ళ బాలుడు, పురుషుడు, మూడు రోజుల క్రితం ఎపీ 28 DM 3775 కారులో బయలుదేరారు. ఓఆర్‌ఆర్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మృతుదేహలుగా బయటపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్ధిక ఇబ్బందులా ? ఎవరైనా హత్య చేశారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రెండ్రోజుల క్రితం పటాన్‌ చెరువు పోలీస్‌స్టేషన్‌లో ఈ కుటుంబ సభ్యులది మిస్సింగ్‌ కేసుగా నమోదైనట్లు సమాచారం.