కోహ్లికి పోటిగా..

SMTV Desk 2017-10-16 19:17:46  virat kohli, hashim amla

హైదరాబాద్, అక్టోబర్ 16 : ప్రస్తుత క్రికెట్ లో టీం ఇండియా కెప్టెన్ కోహ్లి వరుసగా అందరి రికార్డ్స్ ని దాటుకుంటూ వన్డే, ట్వంటీ-ట్వంటీ లో టాప్ బ్యాట్సమన్ గా కొనసాగుతున్నాడు. అయితే దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా మాత్రం కోహ్లి రికార్డ్స్ ని అధిగమిస్తున్నాడు. తాజాగా కోహ్లీ మరో రికార్డును అతడు బద్దలు కొట్టేశాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన వన్డేలో హషీమ్‌ ఆమ్లా (110 నాటౌట్‌)26వ శతకం చేశాడు. ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించింది అతడే. కోహ్లీ ఇందుకు 166 ఇన్నింగ్స్‌లు తీసుకోగా ఆమ్లా 154 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించేశాడు.