ఇంగ్లాండ్‌ పై వార్నర్ మాటల తూటాలు..

SMTV Desk 2017-10-16 19:01:16  ashes series, England, Australia, Sydney,

సిడ్నీ,అక్టోబర్ 16 : ఆటలో గాని,బయట గాని ఆసీస్ ఆటగాళ్ళు ప్రత్యర్ధులను తమ మాటలతో కవ్విస్తూనే ఉంటారు. తాజాగా ఇంగ్లాండ్ -ఆస్ట్రేలియాల మద్య జరిగే యాషెస్‌ అంటే భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ పోరును తలపిస్తుంది. ఈ సందర్బంగా ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మాట్లాడుతూ ‘మాకు చరిత్ర, గర్వం ఉన్నాయి. ఎప్పుడైతే ఆ బాటలో అడుగు పెడతామో అప్పుడది యుద్ధమే! వీలైనంత త్వరగా పోరులో అడుగు పెట్టేందుకు ప్రయత్నించాలి. నేను ప్రత్యర్థి కళ్లలోకి నేరుగా చూస్తూ అతడిపై ఎలా అయిష్టత పెంచాలన్న దానిపై పనిచేస్తా. అతడిపై ఆధిపత్యం చలాయిస్తా. ప్రత్యర్థిని దెబ్బతీయాలంటే అలాంటి నిప్పు రవ్వలు రాజేయాలి. వారిపై అలాంటి శత్రుత్వం పెంచుకుంటేనే శక్తివంచన లేకుండా కసితో పోరాడగలం’అని వార్నర్‌ అన్నారు.