ఐటీ కంపెనీలకు స్థలం రాయితీ...

SMTV Desk 2017-10-16 17:55:27  ap cm, chandrababu naidu, nara lokesh,

అమరావతి, అక్టోబర్ 16 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రాజధానిలో ఐటీ సంస్థల ఏర్పాటుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ .... ఐటీ సంస్థలకు 21 రోజుల్లోపే కార్యాలయం స్థలంతో పాటు అన్ని అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గతంలో అయితే ఐటీ సంస్థలకు అనుమతులకు సంవత్సరం పట్టేదని, ప్రస్తుతం 50 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత మన రాష్ట్రానికి ఐటీ కంపెనీల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి చాలా కృషి చేస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో 2019 నాటికి లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి మార్గానిర్దేశ౦తో డెజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌ విధానాన్ని రూపొందించారని, తద్వారా ఐటీ కంపెనీలకు రాయితీతో కూడుకున్న స్థలాన్ని అందించనున్నారు. దీనికి కోటి చదరపు అడుగుల స్థలం అవసరమని స్పష్టం చేశారు.